telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్ వేవ్ : అసలు ఎలాంటి మాస్కులు వాడాలో తెలుసా!

masks corona

మాస్క్‌ ధారణతో కరోనా కట్టడివాడిన మాస్క్‌లనే ఉతకకుండా ధరిస్తే ముప్పు.భౌతిక దూరం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. మాస్క్‌లు_ధరించడం.. భౌతిక దూరం పాటించడం… చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం.. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండడం… ఇవి.. కరోనా కట్టడికి వైద్యులు సూచించే మార్గాలు. ఇందులో మాస్క్‌లు కీలకమైనవి. వీటిని శుభ్రపరచకుండా ధరిస్తే రిస్క్‌ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లపై అవగాహన పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. 

 

దేశంలో రోజురోజుకూ కరోనా సెకెండ్‌ వేవ్‌ కలకలం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు మన దేశంలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, ధరించిన మాస్క్‌లను ఎలా శుభ్రం చేయాలి? వేటిని వాడగానే చెత్తబుట్టలో పారేయాలనే విషయాల్లో చాలామందికి సరైన అవగాహన లేక ఇష్టారీతిన వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల మాస్కులతో ముప్పు వాటిల్లుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌పై చేరిన వైరస్‌ అంత సులువుగా చనిపోయే అవకాశం ఉండదు. ప్రస్తుతం ధరించి వాడుతున్న వివిధ మాస్కులలో ఒక్కోటి ఒక్కో రకంగా పనిచేయడంతో పాటు వాటిని వాడడంలో సరైన జాగ్రత్తలు తీసు కోవాలని చెబుతున్నారు.

 

#సర్జికల్‌_మాస్క్‌లు..  

                     వీటిని శుభ్రం చేయడం చాలా కష్టం. ఎందుకంటే వీటిని త్వరగా డీగ్రేడ్‌ అయ్యే పేపర్‌ లాంటి మెటీరి యల్‌తో తయారు చేస్తారు. చాలా మంది వీటిని డిస్‌ఇన్ఫెక్ట్‌ చేసి మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదన్నది వైద్యుల మాట. సర్జికల్‌ మాస్క్‌ సెంటర్‌ పార్ట్‌ తయారు చేసేందుకు వాడే మెటీరియల్‌ వైరస్‌ను అంత ఈజీగా లోపలికి పోనివ్వదు. సర్జికల్‌ మాస్కు ధరించినప్పటి నుంచి ఆరు గంటల వరకు పనిచేస్తుంది. మాస్క్‌ను ఉతికినప్పుడు, పార్ట్‌ పాడైనా, తడిసినా అది పనికిరాకుండా పోతుంది. సర్జిక ల్‌ మాస్కు ధరిస్తే ప్రతి ఆరు గంటలకు ఒకసారి తప్పకుండా మార్చాలి. లేదంటే అటువంటివి వాడి తడిపి వేసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

 

#క్లాత్‌_మాస్క్‌లు.. 

        కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది ఇళ్లలో కుట్టిన క్లాత్‌ మాస్కులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇంకొందరు బయట షాపుల లో, రోడ్లపై అమ్మే క్లాత్‌ మాస్కులను కొనుగోలు చేసి వాడుతున్నారు. మాస్క్‌లన్నింటి కంటే క్లాత్‌ మాస్క్‌ లే మంచివన్నది చాలా మంది అభిప్రాయం. అయి తే ఈ క్లాత్‌ మాస్క్‌లను రోజుకోసారి నాణ్యమైన సబ్బు లేదా డిటర్జెంట్‌ పౌడర్‌తో ఉతకాలని వైద్యు లు సూచిస్తున్నారు. క్లాత్‌ మాస్క్‌లను శుభ్రం చేసేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వైరస్‌ చనిపోవాలంటే క్లాత్‌ మాస్క్‌లను దాదాపుగా 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరిగించిన వేడి నీళ్లలో డిటర్జెంట్‌ వేసి ఉతకాలని చెబుతున్నారు. చల్లని నీళ్లతో శుభ్రపరిస్తే వైరస్‌ చనిపోయే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. 

 

#డ్యూటీ_మాస్క్‌లు…  

              హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ వాడే డ్యూటీ మాస్క్‌ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఎన్‌–95, ఎఫ్‌ఎఫ్‌పీ–2 మాస్క్‌లను నీటితో శుభ్రం చేయడం వంటివి చేస్తే వాటిలో ఉండే ఫిల్టర్లు పాడవుతాయి. అందుకే వీటిని వాడిన అనంతరం మూత ఉన్న చెత్తబుట్టలో పారేయడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.  

 

#వైరస్_చనిపోవాలంటే.. 

           కరోనా వైరస్‌ బయటిపొర ఫ్యాటీ ఆయిలీగా ఉంటుంది. అందువల్ల డిటర్జంట్‌తో మాస్క్‌లను రుద్దుతూ ఉతికితే వైరస్‌ బయటి భాగం మాత్రమే పాడవుతుందని మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్లు తెలియజేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందడానికి కారణ మయ్యేది ఆ భాగమేనని చెబుతున్నారు. సబ్బు, డిటర్జంట్‌ వాడితే జిడ్డు జిడ్డుగా ఉండే వైరస్‌ పైన ఉన్న లేయర్‌ పాడవుతుందని, దానివల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని సూచిస్తున్నారు. సబ్బు, డిటర్జంట్‌ వినియోగించి మాస్కులను ఉతికినప్పుడు కొద్ది నిమిషాల పాటు ఆ నురగ నీటిలో నానబెట్టాలని, అలా చేస్తే వైరస్‌ పూర్తిగా నశిస్తుందని స్పష్టం చేస్తున్నారు. 

 

#శుభ్రం_చేసుకున్న_మాస్కులనే_ధరించాలి.. 

             రోజురోజుకు కరోనా కేసు లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. అత్యవసర పని ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. క్లాత్‌ మాస్క్‌లను ప్రతిరోజూ సబ్బు ద్వారా వేడినీటితో ఉతికి శుభ్రం చేసుకుంటే వైరస్‌ నశిస్తుంది. ముఖానికి ధరించిన మాస్క్‌లను ప్రతిసారి చేతులతో తాకకూడదు. మాస్క్‌ను తీసేటప్పుడు జాగ్రత్తగా ముఖానికి తగలకుండా తీయాలి. 

Related posts