telugu navyamedia
సినిమా వార్తలు

ఈరోజే విశాల్ నిశ్చితార్థం

Vishal-and-Anisha

ప్రముఖ తమిళ హీరో విశాల్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ ఆయన తండ్రి, నిర్మాత జికే రెడ్డి ఇటీవలే ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అనీషాను విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ కి చెందిన అనీషా “అర్జున్ రెడ్డి” సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఈ జంట తాజాగా ఈరోజు హైదరాబాద్ లో నిశ్చితార్ధం జరుపుకుంటుంది. అయితే ఈ కార్యక్రమం అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లా సాధారణంగా ఎంగేజ్మెంట్ కి ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ కారణంగానే ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈరోజే పెళ్లి డేట్ కూడా ఖరారు చేసి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. వీరి పెళ్లి హైదరాబాద్ లోనే జరుగుతుంది. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతం విశాల్ “టెంపర్” రీమేక్ “అయోగ్య” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts