మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈ నెల 22 న పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నది . మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా నరేష్ కార్యదర్శిగా శ్రీమతి జీవితా రాజశేఖర్ ఎన్నికయ్యారు . “మా ” ఎన్నికల గత ఆదివారం నాడు హోరాహోరీగా జరిగాయి . శివాజీ రాజాపై నరేష్ విజయం సాధించాడు .
ఇయితే ఇంతవరకు శివాజీరాజా నుంచి నరేష్ ఛార్జ్ తీసుకోలేదు . ఈనెల 22 న శుక్రవారం రోజు మంచి ముహూర్తం కుదిరిందని , అందుకే ఎన్నికల్లో విజయం సాధించిన అందరం ఆరోజు పదవీ భాద్యతలను చేపడుతున్నామని “మా” అధ్యక్షుడు నరేష్ నవ్యమీడియా కు చెప్పారు .
ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో పెద్దల సమక్షంలో బాధ్యతలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు . రెండు ప్యానల్ ల్లో గెలిచిన అందరం ఒక్కటిగా కలసి పనిచేస్తామని అయన తెలిపాడు . నటీనటుల సంక్షేమం కోసం కృషి చేస్తామని , ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్ధానాలు చేశామో అన్నిన్నిటినీ నెరవేరుస్తామని కార్యదర్శి జీవిత చెప్పారు .