telugu navyamedia
సినిమా వార్తలు

నేను కూడా పొట్టి బట్టలు వేసుకున్నా… కానీ… : జయసుధ

Jayasudha

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కొంతమంది పాజిటివ్ గా స్పందించగా… కొంతమంది మాత్రం ఫైర్ అయ్యారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ఆయన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తూ వీడియోనే విడుదల చేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ హీరోయిన్ జయసుధ స్పందిస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నిస్తూ ఆయనకు మద్దతు తెలిపింది. తను కూడా హీరోయిన్ గా ఉన్నప్పుడు మినీ స్కర్ట్ లు, పొట్టి దుస్తులు వేసుకున్నానని… అవన్నీ కేవలం వెండితెరకే పరిమితం చేశానని, ఆడియో ఫంక్షన్ లకు మాత్రం పద్దతిగా వెళ్లేదాన్ని అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఏ కాలం అమ్మాయిలు ఈవెంట్ కు ఎలా రావాలో తెలియట్లేదు అంటూ జయసుధ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Related posts