telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ సినిమాకు మణిశర్మ తనయుడు ?

Mahati-Sagar

మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ “ఛలో”తో మొదటి హిట్ అందుకున్నాడు. అయినప్పటికీ మహతికి సరైన గుర్తింపు రాలేదు. ఈ ఏడాది “భీష్మ”తో రెండో హిట్ అందుకున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అయితే మణి శర్మ కొడుకును అని చెప్పుకోకుండానే హిట్స్ అందుకుంటున్న ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ కు పెద్ద సినిమాకు అవకాశం రావడం లేదు. కానీ ఇప్పుడు “ఛలో” పాటలు నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి మహతికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. అప్పుడు మణిశర్మకు కూడా చిరంజీవి ‘బావగారు బాగున్నారా’ సినిమాతోనే హిట్ వచ్చింది. దాంతో అప్పటినుండి మణి వెనక్కి చూడలేదు. అలాగే ఇప్పుడు మణి కొడుకుకు ‘వేదలమ్’ రీమేక్ లో ఛాన్స్ ఇవ్వనున్నాడట చిరంజీవి. ‘వేదాళం’ రీమేక్ కి మెహర్ రమేశ్ కి దర్శకుడిగా చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. ఇక కాస్త గ్యాప్ తీసుకొని తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నారు. ‘ఆచార్య’ ఇంకా సెట్స్ పైన ఉండగానే మరికొన్ని ప్రాజక్టులను కూడా లైన్లో పెట్టారు. వీటిలో రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి. మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ సినిమా, మరొకటి తమిళంలో వచ్చిన ‘వేదాళం’. ప్రస్తుతం వినాయక్ ‘లూసిఫర్’ స్క్రిప్టుపై పనిచేస్తున్నారు.

Related posts