telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన… మరోసారి కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు

Kangana

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై, డ్రగ్స్ వ్యవహారంపై కంగనా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు తీరుపై, మరోవైపు బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు చేస్తూ కంగనా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. తాజాగా కంగనా మరో వివాదానికి తెరలేపింది. మహా గవర్నర్ తో భేటీ తరవాత కంగన వరుస ట్వీట్ లతో రెచ్చిపోతుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ట్వీట్ చేసింది. ప్రత్యేక హక్కులను ఉల్లంఘించినందుకు మహారాష్ట్ర అసెంబ్లీ అర్నాబ్ గోస్వామికి 60 పేజీల లేఖ పంపినట్లు పేర్కొన్న నివేదికకు సమాధానంగా “కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటిగా ఉంది, కేసుల సంఖ్యలు వేగంగా పెరుగుతున్నాయి, కానీ ఫాసిస్ట్ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రజలను వేధించడంలో బిజీగా ఉంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కావాలి” అంటూ ట్వీట్ చేసింది.

Related posts