telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్ -4” హౌజ్ ను వీడిన సింగర్ నోయల్

Noel

బిగ్ బాస్ 4 సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది. ఒకానొక సమయంలో బిగ్‌బాస్ షోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ హౌజ్‌లో క్రమంగా ఇంట్రెస్టింగ్ టాస్కులు, లవ్ స్టోరీలు, గొడవలు, అల్లర్లు, అప్పుడప్పుడు గ్లామర్ షోలతో, ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అవుతుంది. మోనాల్ ను కావాలనే ఎలిమినేట్ కాకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బిగ్ బాస్ ఎలిమేషన్ ప్రక్రియపై కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కుమార్ సాయి, దివి, దేవి నాగవల్లి ఎలిమినేషన్స్ అన్‌ఫెయిర్ అని అంటున్నారు. అయితే తాజాగా సింగర్ నోయల్ అనారోగ్య సమస్యలతో హౌజ్ ను వీడాడు. ఫిజికల్ టాస్కులలో మిగతా కంటెస్ట్ంట్లతో ధీటుగా ఆడే సత్తా ఉన్న నోయల్‌.. గత కొంతకాలంగా కాలి నొప్పితో బాధపడుతున్నాడు. దానికి తోడూ సరిగ్గా విశ్రాంతి లేకపోవడంతో మెడ నరాలు, భుజాల నొప్పి అతడ్ని మరింతగా బాధిస్తున్నాయి. ఈ విషయాన్ని కెమెరాల ముందు నోయల్ పలుసార్లు విన్నవించాడు. అందుకే నిన్నటి బీబీ డే కేర్ టాస్క్‌లో కూడా బిగ్ బాస్ నోయల్‌కు మినహాయింపు ఇచ్చాడు. ఈ క్రమంలో తాజాగా నోయల్‌ను మెరుగైన చికిత్స కోసం హౌస్ నుంచి వీడ్కోలు తీసుకోమని బిగ్ బాస్ సూచించాడు. మిగిలిన హౌస్ మేట్స్ అతడ్ని గుండె భారం చేసుకుని పంపించారు. కాగా గతంలో కూడా అనారోగ్య సమస్యలతో గంగవ్వ హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.

Related posts