సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుంటే.. రెండో టైటిల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గురిపెట్టింది. మూడేళ్ల తర్వాత నాకౌట్‌కు వచ్చిన బెంగళూరు ఈ సారైనా విజేతగా నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లీగ్‌నుంచి నిష్క్రమిస్తుంది. రెండు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. విజయం సాధించిన జట్టు ఢిల్లీతో జరిగే రెండో క్వాలిఫయర్ తలపడుతుంది. అదృష్టవశాత్తూ రన్‌రేట్ సహకారంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నాలుగు వరుస ఓటములతో ఆ జట్టు పూర్తిగా డీలాపడిపోయింది. ఏబీ డివిలియర్స్‌పై అతిగా ఆధారపడుతుండటం, కోహ్లీ తన స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం కూడా జట్టును దెబ్బ తీస్తోంది. ఇప్పటి వరకు పడిక్కల్ ఒక్కడే నిలకడైన ప్రదర్శన చేశాడు. టోర్నీ ఆరంభంలో తడబడినా…ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు సమతూకంగా ఉంది. అనూహ్యంగా ఓపెనింగ్ అవకాశం దక్కించుకున్న వృద్దిమాన్ సాహా చెలరేగుతుండటంతో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై భారం తగ్గింది. వీరిద్దరు మరోసారి శుభారంభం అందిస్తే ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. అబుదాబిలో టాస్ మరోసారి కీలకంగా మారింది. ఇక్కడ గత ఐదు మ్యాచ్‌లో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. డ్యూ కారణంగా అన్ని జట్లు ఛేదనకే మొగ్గు చూపుతున్నాయి. చూడాలి మరి ఈ రోజు ఆ టాస్ అదృష్టం ఎవరికీ దక్కుతుంది అనేది.
previous post