telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అభినందన్ పై .. పరీక్షల తీరు..ఇదే !!

Pak Denies Permission Plane For Abhinandan

మన కాలం చెల్లిన మిగ్ విమానంతో పాక్ కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పాక్ ఆర్మీ చెర నుంచి ఆయన సురక్షితంగా నిన్న రాత్రి భారత గడ్డపై అడుగుపెట్టడంతో యావత్ భారతావని పులకించిపోయింది. ప్రస్తుతం ఆయన పలు విచారణలను ఎదుర్కోబోతున్నారు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీతో పాటు ఐబీ, ఎన్ఐఏ అధికారులు కూడా ఆయనను విచారించనున్నారు. ఈ విచారణల్లో అసలు ఏం జరిగిందో పూస గుచ్చినట్టు అభినందన్ వివరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అవేమంటే..

* శత్రువులకు దొరికిన తర్వాత స్వదేశానికి చేరేంత వరకు ఏమేం జరిగింది?
* శారీరక సామర్థ్యంలపై పూర్తి వైద్య పరీక్షలు. దేశ రహస్యాలను తెలుసుకునే క్రమంలో ఏమైనా హింసకు గురి చేశారా అనేది ఈ వైద్య పరీక్షల్లో తేలిపోతుంది.
* శరీరంలో ఏమైనా చిప్స్ ను చొప్పించారా? అనే కోణంలో పూర్తి స్థాయిలో స్కానింగ్.
* శరీరంలోకి ఏవైనా ఔషధాలు ప్రయోగించి, జాతీయ భద్రతాంశాలు తెలుసుకున్నారా?
* దేశ రహస్యాలను పాకిస్థాన్ కు అభినందన్ వెల్లడించారా?

నిజానికి వాయుసేన పైలట్ ను ఐబీ, రా విచారించేందుకు వైమానికదళం అంగీకరించదు. కానీ, ఈ వ్యవహారం అత్యంత సున్నితమైన నేపథ్యంలో విచారణకు ఎయిర్ ఫోర్స్ అంగీకరించింది. మరోవైపు శారీరక, మానసిక అంశాల్లో ఏమాత్రం తేడా ఉన్నా… అభినందన్ తన బాధ్యతలను వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. కార్యాలయ బాధ్యతలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. శరీరంలో లోతైన గాయాలు ఉంటే… పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ విధుల్లో చేరాల్సి ఉంటుంది. త్వరగా ఈ ధీరుడు మళ్ళీ విధులలో చేరి దేశసేవలో తరించాలని కోరుకుందాం..!

Related posts