telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేరా బాబా ట్రైలర్ : రామ్ లోపాల వర్మ… అంటూ ఆర్జీవిని టార్గెట్ చేసిన షకలక శంకర్‌

Deraw

వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ”ఎన్నికల తర్వాత కథ” అనే ట్యాగ్ లైన్ పెట్టేసి అచ్చం పవన్ కళ్యాణ్, చిరంజీవిలను పోలిన నటులతో సెన్సేషనల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న వర్మను కొందరు పవన్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘పరాన్నజీవి’ పేరుతో వర్మను కడిగిపారేసే పనిలో పడ్డ ఫ్యాన్స్.. తాజాగా ఆయనపై మరో సినిమా ప్రకటించారు. వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి ‘డేరా బాబా’ అనే టైటిల్ ఫిక్స్ చేసి షకలక శంకర్‌ని రంగంలోకి దించేశారు. వీరు. కె. రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ ‘డేరా బాబా’ వెబ్ సిరీస్‌లో ఆర్జీవీ పాత్రను షకలక శంకర్ పోషిస్తున్నాడు. అంతేకాదు ట్రైలర్ రూపంలో ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేసి ఆర్జీవికి షాకిచ్చారు. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన పవన్ అభిమాన వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. మీరు కూడా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts