telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’ సినిమా ఎలా ఉందంటే?

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన సినిమా పుష్ప . శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో  డైరెక్ట‌ర్ సుకుమార్‌ తెర‌కెక్కించారు. పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన పుష్ప‌ మొదటి భాగం…రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప – ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

పుష్ప కథ ఏంటి

పుష్ప అలియాస్‌ పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) కూలీగా కట్టెల దుకాణంలో పనిచేస్తుంటాడు. అయితే, అతడి పుట్టుకకు సంబంధించిన విషయంలో సమాజంలో అవమానాలే ఎదుర్కొంటూ ఉంటాడు. చిన్నప్పుడే చదువు స్వస్తి చెప్పి ఊరమాస్‌గా పెరుగుతాడు. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అతి తక్కువ సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకమైన వ్యక్తిగా ఉండే కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌)కు దగ్గరవుతాడు.

pushpa review

సరుకును రోడ్డు దాటించడానికి మంచి ఉపాయాలు చెబుతూ.. ఎర్రచందనం స్మగ్లర్‌ల సిండికేట్‌లో భాగస్వామి అవుతాడు పుష్ఫ రాజ్‌. పోలీస్ లుదాడి చేసి లారీ డ్రైవర్ పుష్ప ని పట్టుకుంటారు. అతన్ని అరెస్ట్ చేసి అసలు దీనివెనక ఎవరు అని తమ స్టైల్ లో కొట్టి విచారిస్తారు. అప్పుడు తమతో స్మగ్లింగ్ చేయించేది తమ పుష్ప రాజ్ అని చెప్పటం మొదలెడతాడు. ఈ లోగా పుష్పకు బెయిల్ ఇప్పించేందుకు కొండారెడ్డి(అజయ్ ఘోష్) వస్తాడు. కొండారెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరినవాడు. అతని క్రింద కొంతకాలంగా పుష్ప పనిచేస్తున్నాడన్నమాట.

కొండారెడ్డి లాంటి కొందరు స్మగ్లర్స్ ని వెనక నుంచి లీడ్ చేసే బాస్ మంగళం శీను(సునీల్). వాళ్లంతా ఎప్పటికప్పుడు తమ ఎర్ర చందనం దుంగలు స్మగ్లింగ్ కు కొత్త మార్గాలు అన్వేషిస్తూంటారు. వాటిని పుష్ప తన తెలివితో ఐడియాలు ఇస్తూ..కొండా రెడ్డికు దగ్గర అవుతాడు. పాలబండిలో దుంగలు పెట్టి స్మంగ్లింగ్ చేస్తారు. కానీ అదీ ఎంతోకాలం దాగదు. ఈ క్రమంలో మంగంళ శ్రీను కు చెందిన మాల్ ని ఓ సారి పుష్ప పోలీస్ ల నుంచి సేవ్ చేస్తాడు.

కోట్ల విలువ చేసే మాల్ ని పుష్ప తన తెలివితో సేవ్ చేసినందకు మంగళం శ్రీను ఓ పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో మంగళం శ్రీను బిజినెస్ గురించి ఓ విషయం పుష్పకు తెలుస్తుంది. ఎర్రచందనం దుంగలను మంగళం శీను ..కొండా రెడ్డి దగ్గర తక్కువకు తీసుకుని, బాగా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని రివీల్ అవుతుంది. అది అవకాసం చేసుకోవాలనుకుంటాడు పుష్ప.

Pushpa Movie Review: వెండి తెరపై అల్లు అర్జున్ బ్రాండ్... సుకుమార్ టేకింగ్ వావ్! | Allu Arjun's Pushpa Movie Review And Rating: Sukumar Shown Bunny's Brand on Silverscreen - Telugu Filmibeat

మంగళం శీనును ఒప్పించి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేలా చేస్తే అందులో 50 శాతం షేర్ ఇస్తా అని పుష్పకు.. కొండారెడ్డి ఆఫర్ ఇస్తాడు. ఆ క్రమంలో మంగళం శ్రీనుకు వార్నింగ్ ఇస్తాడు. అలా తన తెలివి, తెగువ తో ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ముందుకు దూసుకుపోతూంటాడు పుష్ప. అయితే అదే క్రమంలో అతని చుట్టూ పోలీస్ లు, మంగళం శ్రీను మనుష్యులు కమ్మేస్తూంటారు. వాటిని దాటుకుని పుష్ప..పుష్ప రాజ్ గా ఎదిగి…ఎర్ర చందనం సిండికేట్ కు..మంగళం శ్రీను ని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటికే సిండికేట్‌కు లీడర్‌గా ఉన్న మంగళ శ్రీను(సునీల్‌)కు పక్కలో బల్లెంలా తయారవుతాడు.

Pushpa Has Big Task in the USA

ఈ క్రమంలో కొండారెడ్డి బ్రదర్స్‌తో పాటు మంగళం శ్రీనుతో శత్రుత్వం పెరుగుతుంది. మరి వారిని పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు? ఎర్రచందనం సిండికేట్ లీడర్‌గా పుష్ప కు ఎదురైన సవాళ్లు ఏంటి? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను.. ఆ కారణంగా అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? పాలు అమ్ముకునే అమ్మాయి శ్రీవల్లితో ప్రేమలో పడిన పుష్ప.. ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా? ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌ లీడర్‌గా ఉన్న పుష్పకు.. కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహాద్‌ ఫాజిల్‌)తో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ‘పుష్ప.. దిరైజ్‌’కథ.

పుష్ప‌లో అల్లు అర్జున్ మొద‌టిసారిగా ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించటం, రష్మిక డీగ్లామర్‌ పాత్ర చేయటం, సునీల్‌, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకులుగా నటిస్తుండటం ఆసక్తిని కలిగించింది. దర్శకుడు సుకుమార్ మాస్‌ ప్రేక్షకులు మెచ్చేలా పుష్పరాజ్‌ను చూపించారు.ప్రతి సన్నివేశం కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా బన్ని అభిమానులకు కనులపండుగగా ఉంటుంది. సాంకేతికంగా ‘పుష్ప’ మరో లెవల్‌లో చూపించారు. పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. స‌మంత స్పెష‌ల్ గురించి ఇంక చెప్ప‌న‌వ‌స‌రంలేదు. సినిమా మొత్తంగా చూస్తే మాస్ ప్రేక్ష‌కుల‌తో పాటు బ‌న్నీ అభిమానుల‌కు పిచ్చేక్కించేవిధంగా సుకుమార్ తెర‌కెక్కించారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ , రష్మికా మందన్న, ఫహాద్‌ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ, ధనుంజయ్, అజయ్‌ ఘోష్, బాబీ సింహా తదితరులు న‌టించారు.

Related posts