telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంతా ఆమె వల్లే… మాజీ భార్యపై స్టార్ హీరో కామెంట్స్

Saif

ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన మాజీ భార్య అమృతా సింగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆమె తన జీవితంలో ఎంతో సాయం చేసిందని చెప్పారు. 1991లో సైఫ్, అమృత సింగ్ పెళ్లి చేసుకున్నారు. సైఫ్ కంటే అమృత వయసులో పెద్దవారు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇబ్రహీం, సారా. సారా ఇప్పుడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలకు పోటీనిస్తూ దూసుకెళ్తోంది. అయితే పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడే సైఫ్, అమృత మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత అమృత అమెరికా వెళ్లిపోయారు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సైఫ్‌కు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ పరిచయమైంది. వీరిద్దరూ కలిసి ‘టషన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. సైఫ్ కరీనా కంటే పదేళ్లు పెద్దవాడు. కరీనా ఇంట్లోవారితో మాట్లాడి పెళ్లికి ఒప్పించి మీడియాకు తెలీకుండా పెళ్లి చేసుకున్నారు. తాజాగా సైఫ్ మాట్లాడుతూ “నేను ఇంట్లో నుంచి పారిపోయి 20 ఏళ్లకే అమృతను పెళ్లి చేసుకున్నాను. నా కెరీర్‌ని సీరియస్‌గా తీసుకోవాలని నాకు నేర్పించింది నా మాజీ భార్య అమృతే. నా కెరీర్‌లో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఆమే కారణం. టార్గెట్‌ని సులువుగా తీసుకుని నవ్వుకుంటూ ఉంటే దాన్ని సాధించలేమని చెప్పింది. అప్పుడే నేను నా ప్రొఫెషన్‌ను సీరియస్‌గా తీసుకున్నాను. అలా నాకు పరంపరా సినిమాలో అవకాశం వచ్చింది. ‘దిల్ చాహతా హై’ సినిమాలో నా పాత్రలో నటిస్తానో లేదో నాకే నమ్మకం లేదు. ఎలా నటించాలని అందరినీ అడిగేవాడిని. ఆమిర్ ఖాన్ కూడా సలహా ఇచ్చాడు. అప్పుడు అమృతానే నాపై నాకు నమ్మకం కలిగించింది. ఎందుకు అందరినీ సలహాలు అడుగుతున్నారు అని మందలించింది. నాకు నేనే ఎలా నటించాలో నేర్చుకోవాలని చెప్పింది. ఆమె చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని ఆ సినిమాలో నటించాను. ఆ తర్వాత అది నాకు లైఫ్‌నిచ్చిన పాత్ర అయిపోయింది. నేను కరీనాను పెళ్లి చేసుకుంటున్న సమయంలో అమృతకు ఓ లెటర్ రాశాను. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని లెటర్‌లో వివరించాను. ఆ లెటర్‌ను కరీనాకు కూడా పంపాను. ఈ లెటర్‌ను నా కూతురు చూసింది. నాన్నా నేను పెళ్లికి రావాలనే నిర్ణయించుకున్నాను. కానీ ఈ లెటర్‌ను చదివాక సంతోషమైన మనసుతో పెళ్లికి రావాలనుకుంటున్నాను అంది. అలా నా మాజీ భార్యతో కథ ముగిసింది” అని వెల్లడించారు సైఫ్.

Related posts