telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ క్రెడిట్‌ మొత్తం నీదే… మంచులక్ష్మీకి సూర్య ట్వీట్

Surya

మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో విలక్షణ నటుడు సూర్య నటించిన చిత్రం ‘శూరరై పోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రాజశేఖర్‌ కర్పూర సుందర పాండియన్‌, గునీత్‌ మోంగ, ఆలీఫ్‌ సుర్తితో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా.. దానిపై మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో స్పందించారు. ఈ మూవీ కోసం చాలా ఎదురుచూస్తున్నా. ఈ దీపావళి మరింత ప్రకాశం కానుంది అని కామెంట్లు పెట్టారు. దానికి స్పందించిన సూర్య.. ఈ మూవీని నీకు చూపేందుకు ఎదురుచూస్తున్నా. ఈ క్రెడిట్‌ మొత్తం నీదే. మోహన్‌ బాబు సర్‌ని ఈ మూవీ కోసం ఒప్పించినందుకు చాలా థ్యాంక్స్‌. ఇది నిజంగా నాకు బ్లెస్సింగ్ అని ట్వీట్ చేశారు. దీపావళి కానుకగా ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుంది.

Related posts