telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ వారం బిగ్ బాస్-4 వ్యాఖ్యాత ఎవరు ?

Bigg-Boss

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం నాగ్ ప్ర‌స్తుతం హిమాల‌యాల్లో ఉన్న విష‌యం తెలిసిందే. అక్క‌డే 21 రోజులు ఉండ‌బోతున్నారు. అందుక‌ని బిగ్‌బాస్ బాధ్య‌త‌ను కోడ‌లుపిల్ల సామ్ భుజాల‌పైన వేశారు. ఈ క్ర‌మంలో సామ్ చేసిన‌ ద‌స‌రా ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ వారం కూడా సమంతా హోస్టుగా వస్తుందా.? లేక కింగ్ కనిపిస్తాడా.? అని సందిగ్దత నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ వారం నాగార్జునే షోకు హోస్టుగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. కేవలం దసరా ఎపిసోడ్‌కు మాత్రమే సమంతాను బిగ్ బాస్ నిర్వాహకులు హోస్టుగా తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ వారం ఎపిసోడ్ ను ఎవరు హోస్ట్ చేస్తారో చూడాలి.

Related posts