telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మరోసారి ప్రత్యేకంగా కనిపిస్తున్న.. అల్లరినరేష్.. క్రైమ్‌ థ్రిల్లర్‌…

allarinaresh nandhi movie still

అల్లరి నరేష్ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తూ, తాజాగా నాంది అనే సినిమా చేస్తున్నాడు. ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ‘నాంది’ చిత్రంతో విజయ్‌ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకోనున్నదని నరేష్ అన్నారు. రీసెంట్‌గా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇందులో అల్లరి నరేష్ లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది.

నాంది సినిమా కోసం బ్రహ్మకడలి, ఛోటా.కె.ప్రసాద్‌, శ్రీచరణ్‌ పాకాల, అబ్బూరి రవి వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పనిచేస్తున్నారు. సామాజిక అంశాలు మేళవించిన ఈ థ్రిల్లర్‌ సినిమా జనవరి 22 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్‌ పాకాల అందిస్తున్నారు.

Related posts