telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణతో సినిమా చేయడంపై స్పందించిన రాజమౌళి

rajamouli

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్న రాజమౌళి పలు మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నోవిషయాలను బయటపెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన ఆయన, గతంలోనే బాలయ్యతో సినిమా చేయాలనుకున్నానని చెప్పారు. పదిహేడేళ్ల కిందే ఆయనతో సినిమా చేయాలనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. స్టార్ హీరోలతో సినిమాలు చూసి తమ స్థాయిని పెంచుకోవాలనే కోరిక ప్రతి దర్శకుడికి ఉంటుందని, ఏదైనా కథ అనుకున్నప్పుడు ఫలానా హీరో అయితే సరిపోతాడని దర్శకులకు ముందే అనిపిస్తుందని జక్కన్న అన్నారు. అలానే నాకు అలా తనకు కూడా కొన్ని కథలు విన్నప్పుడు బాలకృష్ణ గారైతే బెటర్ అనే ఫీలింగ్ కలిగిందని రాజమౌళి చెప్పారు. బాలయ్యతో సినిమా చేయాలని తాను భావిస్తున్నప్పటికీ, ఇప్పట్లో అది కుదరకపోవచ్చని అన్నారు జక్కన్న. ఇక బాలయ్య సినిమాలంటే రాజమౌళికి చాలా ఇష్టమని, బాలయ్య సినిమాను ఫస్ట్ డేనే థియేటర్‌కి వెళ్లి చుసిన సందర్భాలు చాలానేవున్నాయని చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి.

Related posts