telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపాసన “వాలంటైన్స్ డే” ట్వీట్ వైరల్

Upasana

హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే తెలిసిందే. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలతోపాటు పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తారు ఉపాసన. అటువంటి ఉపాసన ప్రేమికుల రోజు సందర్భంగా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘నిన్ను నువ్వు ప్రేమించు’’..అంటూ ట్వీట్ చేశారు. ‘‘మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా? ప్రశ్నించిన ఉపాసన.. అందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. “మొదట నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే ఎలాంటి షరతులు లేకుండా ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయి. నీ మొత్తం ప్రపంచం మార్పుకు సాక్ష్యంగా నిలబడాలి” అని తెలిపారు.

Related posts