telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీసీఎం .. మూడు నెలల పాలన ఇలా..

AP

నేటికి ఏపీసీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు పూర్తయ్యింది. గతంలో ఏ పార్టీ, ఏ నాయకుడు సాధించలేని విధంగా 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. తొలి మూడు నెలల కాలంలో సీఎం తన మార్క్ డెషీషన్స్ ముందుకు సాగారు. మొదటిసారి సీఎం అయినా, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా, ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..జగన్ పాలనపై ప్రజల్లో పట్ల పెద్దగా వ్యతిరేకతా లేకపోగా..రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరన్న నమ్మకం కనిపిస్తోంది. ఈ మూడు నెలల్లో ఆయన రూలింగ్‌పై ఓ లుక్ వేద్దాం….

సానుకూలత పొందిన అంశాలు :

* ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం
* గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీ
* ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఫించన్లను రూ.2 వేల నుంచి రూ.2250కి పెంపు
* నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు
* ఆశా వర్కర్ల వేతాలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం
* నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దిశగా ప్రకటన
* పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సానుకూల వాతావరణం
* రైతులకు మేలు చేసే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు

ప్రజలు కాస్త నెగటీవ్‌గా ఫీల్ అయిన అంశాలు :

* ప్రజావేదిక కూల్చివేత
* రాజధాని మార్పుపై మంత్రుల ప్రకటనలు

Related posts