చైనాలోని జువాంగ్‌జౌ నగరం నుంచి ఓ విమానం న్యూయార్క్‌కు బయల్దేరింది. మరో 6 గంటల్లో న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం దిగాల్సిన సమయంలో లోపల ఉన్న 70 ఏళ్ల ఓ రోగి పొత్తి కడుపులో నొప్పితో విలవిలలాడాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ జాంగ్ హాంగ్ పేషెంట్‌ను పరీక్షించాడు. విమానాన్ని మధ్యలో కిందికి దింపలేని స్థితి. ఆయన ప్రొస్ట్రేట్ గ్రంధి వ్యాకోచంతో బాధపడుతున్నారని, తరచూ మూత్రాశయం నుంచి మూత్రాన్ని క్లియర్ చేయాలని బంధువులు తెలిపారు. దాంతో పేషెంట్ మూత్ర ద్వారానికి డాక్టర్ ఓ ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని బయటకు పీల్చాడు. ఆ మూత్రాన్ని ఓ ఖాళీ వైన్ బాటిల్ పోస్తూ మూత్రాశయాన్ని ఖాళీ చేశాడు. అలా చేయకుంటే పేషెంట్ కోమాలోకి వెళ్లి చనిపోయే ప్రమాదముందని డాక్టర్ చెప్పారు.
previous post
విద్వేష భావజాలంతోనే మా పోరాటం: రాహుల్