telugu navyamedia
రాజకీయ

దేశ ప్రజలకు నుపూర్ శర్మ క్షమాపణ చెప్పాలి..- సుప్రీం కోర్టు మండిపాటు

*నుపుర్‌శ‌ర్మ‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ‌..
*నుపుర్‌శ‌ర్మ అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రించి సుప్రీం
*ఉద‌య్‌పూర్ ఘ‌ట‌న‌కు నుపుర్‌శ‌ర్మ వ్యాఖ్య‌లే కార‌ణం

*దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు నుపుర్ శ‌ర్మ బాధ్యురాలు

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శ‌ర్మ‌కు సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఓ పార్టీకి అధికార ప్రతినిధి అయితే మాత్రం ఇష్టానుసారం మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓ టీవీ చ‌ర్చ‌లో మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల అనంత‌రం ప‌లు చోట్ల అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. ఇటీవ‌ల ఉద‌య్‌పూర్‌లో ఓ టైల‌ర్‌ను హ‌త్య చేయ‌డానికి కూడా నుపుర్ వ్యాఖ్య‌లే కార‌ణం.. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.

అయితే, బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో… దేశ‌వ్యాప్తంగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల‌ను ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టింది

దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆమె ఒక్క‌రే వ్య‌క్తిగ‌తంగా బాధ్యురాల‌ని, యావ‌త్ దేశానికి ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోర్టు తెలిపింది.

టీవీ చ‌ర్చ స‌మ‌యంలో ఆమెను ఎలా రెచ్చ‌గొట్టారో చూశామ‌ని, కానీ ఆ త‌ర్వాత ఆమె  మాట్లాడిన తీరు ఆందోళ‌న‌ల‌కు దారి తీసింద‌ని, నుపుర్ దేశానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జ‌స్టిస్ సూర్య కాంత్ త‌న తీర్పులో అభిప్రాయ‌ప‌డ్డారు.

 చర్చా కార్యక్రమంలో యాంకర్ ప్రశ్నకు నుపూర్‌ శర్మ సమాధానం ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పగా అలాంటప్పుడు ఈ కేసులో యాంకర్‌ను కూడా ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 

దేశ భద్రతకు ముప్పు తెచ్చింది నూపుర్‌ శర్మనేనని వ్యాఖ్యానించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని నూపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.

Related posts