telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిత్తిరి సత్తికి షాకిచ్చిన టీవీ9

Satthi

యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిత్తిరిసత్తి ఉరఫ్ రవికుమార్‌కి షాక్ ఇచ్చారు టీవీ9 నిర్వాహకులు. ఆయన్ని టీవీ9 నుంచి తొలగిస్తూ యాజమాన్యం మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితంకి సంబంధించిన కొన్ని విషయాలని బిత్తిరి సత్తి తన స్కిట్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటుగా ఇటీవల కాలంలో ఇస్మార్ట్ న్యూస్ బాగా పాపులర్ కావడంతో పాటుగా తన రెమ్యూనరేషన్ కూడా పెద్ద మొత్తంలో పెంచాలని బిత్తిరిసత్తి డిమాండ్ చేసినట్లుగా సమాచారం ఉంది. అంతే కాకుండా తన ఇష్టానుసారంగా బిత్తిరిసత్తి వ్యవహరించడం యజమానికి గిట్టకపోవడంతో ఈ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా స్కిట్స్ విషయంలో బిత్తిరిసత్తి సొంత నిర్ణయాలు తీసుకోవడం.. దీనిపై పలుమార్లు యాజమాన్యం బిత్తిరి సత్తిని హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడంతో ఉద్వాసన తప్పలేదు. ఇటీవల కాలంలో సొంత పోకడలకు పోతున్నా బిత్తిరి సత్తి ని వారించినప్పటికీ వినకపోవడంతో అతనిపై వేటు పడినట్టు తెలుస్తోంది. అయితే తనను ఈ స్థాయికి తీసుకు వచ్చిన v6 ఛానల్ కి వెళతాడా లేదా మరే ఛానెల్ కి వెళ్తాడు అన్నది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. కాగా యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేకే బిత్తిరిసత్తి టీవీ9 రాజీనామా చేశారని మరో వాదన వినిపిస్తుంది. ఇదిలాఉంటే v6లో తీన్మార్ వార్తలు బిత్తిరిసత్తిని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ బులిటెన్‌కి టాప్ రేటింగ్ వచ్చింది.

Related posts