telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రిటైర్మెంట్‌పై రాయుడి యూ-టర్న్‌ .. ట్విట్టర్ లో విమర్శలు..

ambati rayudu retirement from international format

అంబటి రాయుడు తన రిటైర్మెంట్‌పై యూ-టర్న్‌ తీసుకోవడంపై ట్విటర్‌లో కొందరు వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. అతడు భారత షాహిద్‌ అఫ్రిది అని ఎగతాళి చేస్తున్నారు. కొందరైతే ఇంకెన్నాళ్లు ఇలా.. అని అంటున్నారు. రెండేళ్లు నిలకడగా టీమిండియాకు ఆడిన రాయుడిని సెలక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. మూడు కోణాల్లో అవసరం అవుతాడని ఐదు మ్యాచ్‌లు కూడా ఆడని విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. భావోద్వేగం చెందిన రాయుడు ప్రపంచకప్‌ వీక్షించేందుకు ‘3డీ’ కళ్లద్దాలు కొనుగోలు చేస్తానని సెటైర్‌ విసిరాడు.

ప్రపంచ కప్ కోసం రాయుడు, పంత్‌కు చోటివ్వకపోవడంతో విమర్శలు రావడంతో వారిని బ్యాకప్‌ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. శిఖర్ ధావన్‌కు గాయం అవ్వడంతో పంత్‌ను ఇంగ్లాండ్‌ పిలిపించారు. సాధనలో బుమ్రా విసిరిన యార్కర్‌ తగిలి గాయపడ్డ విజయ్‌ శంకర్‌ స్థానంలో అంబటి రాయుడిని ఎంపిక చేయొచ్చని అంతా భావించారు. సెలక్టర్లు మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించడంతో అతడు భావోద్వేగానికి గురయ్యాడు. వెంటనే అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. తాజాగా అతడు వీడ్కోలు ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టు రాయుడు ప్రకటించాడు. దీంతో ట్విటర్లో కొందరు సెటైర్లు వేస్తున్నారు.

Related posts