telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సంతోషం..

నా మనసుకి వేసుకున్న బంధనాలను త్యజించి
కష్టాలను ఇష్టాలుగా మలచుకుంటూ
ఊహల లోకంలో తెలియాడుతూ నాకై నేను
సంతసం భూలోకంలో నిర్మించుకోనీ
సంతస సాగర కొలను నందు చిన్ని గృహంలో
నాకోసం సుందరంగా అలంకరించుకొని
నా మనస్సుని అక్షరాలుగా చేసి
అందమైన కవితలు రాస్తూ
సందేశాత్మక కథానికలు రాస్తూ
ముత్యాల పాటలు అల్లుతూ
కూని రాగాల పాటలని పాడుతూ
భూమితో వ్యవసాయ చేస్తూ
మొక్కలతో సహవాసం చేస్తూ
మధురమైన ఫలమును ఇస్తూ
నా జీవిత కాలం మొత్తం అక్కడే
ఒక సూర్యుడినై వెలుగుతూ
జాబిలమ్మ తో సంభాషిస్తూ
నేను నిర్మించుకున్న ఈ ఆపేక్షాలోకంలో
నా మనస్సుకి నేను పాఠకుడిగా
సంతోషంగా జీవించాలి ఈ విశాలమైన
సంతనసాగర కొలనునందు

Related posts