telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“తను చాలా మంచిది… నాకు కరెక్ట్ జోడీ…” ప్రియురాలి గురించి రానా ఆసక్తికర కామెంట్స్

rana

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా త్వరలో తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వచ్చే నెల 8వ తేదీన హైదరాబాద్‌లో వీరి వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ రానా తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. “నా ప్రేమికురాలు మిహికా ఇల్లు మా ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మేమంతా ఒకే ప్రాంతంలో ఉంటాం. జీవితంలో కొన్ని సార్లు అన్నీ సజావుగా సాగిపోతుంటాయి. తను చాలా మంచిది. నాకు కరెక్ట్ జోడీ. మేం చాలా గొప్ప జంటగా నిలుస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరుగబోతోంది. ఆ రోజు నా వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమమైన, అద్భుతమైన రోజు” అని రానా అభిప్రాయపడ్డాడు.

Related posts