telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్‌లో ఆమె ఆశలు రేకెత్తించింది… : కంగనా కామెంట్స్

Kangana

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు విషయమై ముంబై పోలీసులతో పాటు సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగడంతో రకరకాల కోణాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియాను కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేపడుతుండగా… సైఫ్ అలీఖాన్ కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌తో సుశాంత్ ప్రేమాయణం సాగించాడనే విషయం బయటకు వచ్చింది. సారాను సుశాంత్ ఓ ప్రైవేట్ జెట్‌లో బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడని, అక్కడ వారిద్దరూ మూడు రోజులు ఎంజాయ్ చేశారని సుశాంత్ సన్నిహితులు వెల్లడించారు. సుశాంత్, సారా అఫైర్ గురించి తాజాగా కంగన స్పందించింది. “సుశాంత్, సారా అఫైర్ గురించి మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. బ్యాంకాక్‌లో వారిద్దరూ ఒక రూమ్‌ను పంచుకున్నారు. సుశాంత్‌లో ఆమె ఎన్నో ఆశలు రేకెత్తించింది. స్టార్ వారసురాలైన సారా బయటి నుంచి వచ్చి కష్టపడుతున్నవాళ్లకు ఇలాంటి ఆశలు చూపించడం ఎందుకు? తర్వాత వారిని పబ్లిక్‌గా ముంచడం ఎందుకు?” అంటూ కంగనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

Related posts