telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్ ?

Sunil

స్టార్‌ కమెడియన్‌గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నారు సునీల్. ఈ సినిమా విజయం సాధించడంతో ఆ తర్వాత పూలరంగడు, మర్యాద రామన్న.. వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించాడు సునీల్. అయితే ఈ సినిమాలతో విజయాలు అందుకున్నా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో ఆయనకు ఛాన్సులు ఇచ్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ‘కలర్ ఫోటో’లో విలనిజం చూపించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కమెడియన్‌గా ఇప్పుడు ఆయనకు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. ఈ తరుణంలోనే సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడన్న వార్త హల్చల్ చేస్తోంది. కన్నడలో విజయం సాధించిన ‘బెల్‌బాటమ్’ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారట. కామెడీతో పాటు స్పై తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించారు. ఈ రీమేక్ మూవీలో సునీల్‌ను హీరోగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో సునీల్ మళ్లీ హీరోగా చేసే సాహనం చేస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts