telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ రెండు సిటీలలో కాజల్ రిసెప్షన్ వేడుక

Kajal

హీరోయిన్ కాజల్ ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతానికి షూటింగుల పని పక్కన పెట్టి ముందు భర్తతో హనీమూన్‌ ఎంజాయ్ చేస్తోంది కాజల్. ఈ విషయాన్ని ఇటీవలే కాజల్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. మాల్దీవ్స్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో సేద తీరుతున్నారు ఈ జంట. అయితే కాజల్ పెళ్ళికి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా తక్కువ మంది సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే పెళ్లి నిరాడంబరంగా జరిగినా కూడా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గానే ప్లాన్ చేస్తుంది చందమామ. దీనికోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తుంది ఈ బ్యూటీ. కొన్ని రోజుల తర్వాత భారీగానే ఈ వేడుక ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించబోతుంది కాజల్ అగర్వాల్. వాళ్లకు అనువుగా ఉండేలా రెండు చోట్ల రిసెప్షన్‌లను ఏర్పాటు చేయబోతోందట. హైదరాబాద్, చెన్నైలలో భారీగా విందు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. హైదరాబాద్ లో జరిగే వేడుకకు తెలుగు ఇండస్ట్రీని స్వయంగా ఆహ్వానించబోతుంది కాజల్. అందులో తన స్నేహితులతో పాటు అంతా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. మరోవైపు తమిళనాట కూడా కాజల్ చాలా సినిమాలు చేసింది. అక్కడ కూడా స్టార్ హీరోలందరితోనూ నటించింది. దాంతో చెన్నైలో జరిగే వేడుకకు అక్కడి వాళ్లను పిలవనుందట.

Related posts