telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీ నాన్న వల్లే ఆ బ్లాక్ బస్టర్ మూవీని వదులుకున్నా… : కంగనా

Kangana

ఇటీవల పూజా భట్‌ ఒక వీడియో పోస్ట్‌ చేసి ఆమెకు మొదటి ఆఫర్‌ ఇచ్చిన మా నాన్న గారిని విమర్శించడం కంగనా విజ్ఞతకే వదిలేస్తున్నాను అంది. అంతేకాకుండా మొదటి సినిమాకు అవార్డు అందుకున్న సమయంలో మానాన్న మహేష్ భట్ ను స్టేజ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో పాటు హగ్ కూడా చేసుకుంది అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. అప్పుడు ప్రశంసలు కురిపించి ఇప్పుడు విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అంటూ పూజా భట్ సీరియస్ అయ్యింది. ఈ వీడియోపై కంగన స్పందిస్తూ.. “మీ నాన్న అవకాశం ఇవ్వడం వల్ల నాకు పెద్ద నష్టమే జరిగింది. ఆ సమయంలోనే నాకు తెలుగులో మహేశ్‌బాబు `పోకిరి` సినిమాలో అవకాశం వచ్చింది. మీ `గ్యాంగ్‌స్టర్‌` వల్ల `పోకిరి`లాంటి మంచి సినిమాను వదులుకున్నాను” అని కంగన తెలిపింది.

Related posts