telugu navyamedia
సినిమా వార్తలు

“సూర్యకాంతం” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ

Suryakantham

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న “సూర్యకాంతం” చిత్రం మార్చి 29న విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్, సందీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కు, టీజర్ కు రీ ఫ్రెషింగ్ గా ఉందంటూ మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు పంపిణీ చేస్తుండటం సినిమాకు కలిసొచ్చే విషయం. శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రమైనా మెగా హీరోయిన్ నిహారికకు మంచి హిట్ ను అందిస్తుందేమో చూడాలి.

Related posts