మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయి.
ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్..ఆచార్య ప్రీ రిలీజ్ ఈ నెల 23వ తేదీ హైదరాబాద్ లో జరపనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
మొదట విజయవాడలో ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక సన్నాహాలు చేశారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఆ తరువాత వేడుకను హైదరాబాద్ కు మార్చారు.
దీంతో ఒకే వేదికపై మెగాస్టార్, పవర్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్ సందడి చేయనున్నారు. దీంతో అభిమానులకే పండగే..