telugu navyamedia
తెలంగాణ వార్తలు

సీఎం చెప్పార‌ని ఫైల్స్ పై సంత‌కం చేయ‌డానికి ..నేను ర‌బ్బ‌ర్ స్టాంప్ కాదు

*తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
*ఢిల్లీ వెళ్ళిన వెంట‌నే నాపై ఆస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నారు..
*కేసీఆర్‌తో కలిసి పనిచేయడం పెద్ద స‌వాల్

*న‌న్ను వేరే రాష్ర్టానికి మారుస్తార‌నేది వాస్త‌వం కాదు

తెలంగాణలో గవర్న తమిళిసై సౌందరరాజన్ మ‌రోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో కలిసి పని చేయడం కష్టమని తెలంగాణ గవర్నర్ తమిళిసై చెప్పారు.

ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా ఎన్నికైనా ముఖ్య‌మంత్రులు నియంతలా మార‌డం స‌రికాద‌ని అన్నారు. ప్రస్తుతం తాను రెండు రాష్ట్రాల సీఎంలతో కలిసి పనిచేస్తున్నాన‌ని అన్నారు. ఇద్దరూ కూడా భిన్నమైనవారని గవర్నర్ అన్నారు. ఈ రకమైన పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

సీఎం చెప్పార‌ని ఫైల్స్ పై సంత‌కంచేయ‌డానికి ..తాను ర‌బ్బ‌ర్ స్టాంప్ గ‌వ‌ర్న‌ర్‌ని కాద‌ని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన వెంట‌నే నాపై ఆస‌త్య ప్ర‌చారాలు మొద‌లు పెట్టార‌ని అన్నారు. సమస్యలు ఉంటే ప్రశ్నిస్తానన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారన్నది కరెక్ట్ కాదన్నారు.

రాజ‌కీయంలో ఎక్కడైనా ప్రత్యర్థులను విమర్శిస్తుంటారని… తెలంగాణ మాత్రం గవర్నర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. .
సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా ఉంటుందో ..తెలంగాణ‌ను చూస్తే అర్ధ‌మ‌వుతుంద‌ని త‌మిళ‌సై అన్నారు.

Related posts