telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందనంత ఎత్తులో “దర్బార్” ప్రమోషన్లు

Darbhar

మురుగ‌దాస్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాంబోలో వస్తోన్న సినిమా “ద‌ర్భార్”. “ద‌ర్భార్” చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పోలీస్ అధికారి ఆదిత్యా అరుణాచలం పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమ‌కూరుస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. హిందీ నటుడు సునీల్ శెట్టి, యోగి బాబు, తంబి రామయ్య, శ్రీమన్, ప్రతీక్ బబ్బర్, జతిన్ సర్న, నవాబ్ షా, దలిప్ తాహిల్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ తెలుగు లో విడుదల చేస్తున్నారు, జనవరి 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రేపు సాయంత్రం శిల్పక‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రుపుకోనుంది. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్రం రిలీజ్ కానున్న నేప‌థ్యంలో సినిమాకి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తుంది లైకా నిర్మాణ సంస్థ‌. అయితే కొన్నాళ్ళుగా రజ‌నీకాంత్ సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ బ‌స్సులు, రైళ్ళే కాదు ఏకంగా ఫ్లైట్ల‌పై కూడా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. తాజాగా ద‌ర్భార్ సినిమా పోస్ట‌ర్స్ కూడా విమానాల‌పై ద‌ర్శ‌నం ఇస్తుండ‌డంతో ఫ్యాన్స్ వీటిని చూసి తెగ సంబరపడిపోతున్నారు.

Related posts