మరో శిక్షణ విమానం జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ వద్ద కుప్పకూలింది. పత్తిచేనులో విమానం కూలడంతో ప్రమాదంలో శిక్షణ పైలట్ ప్రకాశ్ విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతింది, విమానం బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది.
వర్షం కారణంగా అదుపుతప్పి విమానం కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. కూలడానికి ముందు కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలికి బేగంపేట్ ఎయిర్‌పోర్టు సిబ్బంది చేరుకున్నారు. ప్రమాదస్థలికి పరిసర గ్రామాల ప్రజలు భారీగా చేరుకుంటున్నారు.
ఆ సీఐకి అన్నీ తెలుసు..వివేకా కూతురు