telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇండియా కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధాని ఎక్కడ?

India-Map

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఇండియా కొత్త మ్యాప్‌లో ఏపీ రాజధానికి చోటు దక్కలేదు. మ్యాప్‌లో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నట్లు చూపించి, ఏపీకి మాత్రం రాజధాని లేనట్లుగా చూపించారు. దీంతో ఏపీ రాజధాని వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించ లేదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది.

జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో.. భారత్‌లోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం కొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో దేశంలోని అన్ని రాష్ట్రాలు, రాజధానుల్ని గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధాని లేనట్లుగా చూపించారు. . ఇప్పుడు ఈ మ్యాప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధాని వ్య్వహారమ్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబును టార్గెట్ చేశారు. ‘మోసం నీ సహజ గుణమని నిరూపించావ్ చంద్రబాబు..ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే క్షమించరాని తప్పు చేశావ్.. 5 కోట్ల మంది ఆంధ్రులను 5 సంరాలు రాజధాని పేరుతో మోసం చేసి,కేంద్ర నిధులు లెక్క చెప్పకుండా వేల కోట్లు ఖర్చుచేసి,ఆఖరికి దేశ చిత్రపటంలో ఏపీ రాజధాని అడ్రస్ లేకుండా చేసి తీరని ద్రోహం చేశావ్’చంద్రబాబుపై కన్నా విరుచుకుపడ్డారు.

Related posts