telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలిలో మంత్రి అనిల్ వ్యాఖ్యల పై టీడీపీ నిరసన

Anil kumar jadav minister

ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలిలో నిధుల అక్రమాలపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. బ్రిటీష్ కౌన్సిల్‌కు ఏడు కోట్లు, జ్ఞానబేరి కార్యక్రమానికి 5.4 కోట్లు ఇచ్చారని విద్యాశాఖ మంత్రి సురేష్ ఆరోపించారు. ఈ వ్యవహారాల్లో అప్పటి మంత్రి, అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యా శాఖ నిధులు రూ.180 కోట్లను పసుపు కుంకుమకు మల్లించారని సురేష్ ఆరోపించారు.

మంత్రి సురేష్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన నారా లోకేష్ నిధులు పేద ప్రజల కోసమే మల్లించామని, సొంత కంపెనీల కోసం కాదని స్పష్టం చేశారు. తమపై 11 చార్జిషీట్లు లేవని, 16 నెలలు జైలుకు వెళ్లలేదని సమాధానమిచ్చారు. లోకేశ్ వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి అనిల్ తమది వెన్నుపోటు పార్టీ కాదనిచీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

Related posts