telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నల్గొండ : .. 20వేలకే .. ఎకరా భూమి.. రియల్ భూమ్..

govt employees real estate with govt lands

జిల్లా దేవరకొండ పాత తాలూకా పరిధిలోని చందంపేట మండలం దాదాపుగా కొండలు, గుట్టల మధ్య ఉండే ప్రాంతం, దానిలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తుంటారు. మండల కేంద్రానికి సమీపంలోనే అచ్చంపేటపట్టి అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామ రెవెన్యూలోని సర్వే నంబర్ 50లో దాదాపు 900 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు విడుతలుగా జరిగిన భూపంపిణీలో భాగంగా భూమిలేని పేదలకు కొంత పంపిణీచేశారు. మిగిలిన భూమిపై స్థానిక రెవెన్యూ అధికారుల కన్ను పడింది. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకొని దాదాపు 250 ఎకరాల భూమిని అక్రమంగా విక్రయించారు. ఒక్కొక్కరికీ ఎకరాలకు ఎకరాలే రాసిచ్చారు.

ప్రభుత్వ భూమికి అసైన్డ్ పట్టాలు కాకుండా.. ఏకంగా ప్రైవేట్ పట్టాలు జారీచేశారు. స్థానికులు, స్థానికేతరులు అనే తేడాలేకుండా.. ఎవరు డబ్బులు ఇస్తే వారిపేరిట పట్టాలు ఇచ్చేశారు. 1026 అనే ఖాతా నంబర్‌పై ఈ సర్వే నంబర్‌లో 60 ఎకరాల భూమి పట్టాచేసినట్టు స్థానికులు నమస్తే తెలంగాణకు వివరించారు. అలాగే ఖాతా నంబర్ 175కు 11 ఎకరాలు, ఒకరికి 19 ఎకరాలు, మరొకరికి 13 ఎకరాలు ఈ ప్రభుత్వ భూమి పట్టా అయిందని స్వయంగా స్థానిక వీఆర్వోనే చెప్తున్నారు. అచ్చంపేటపట్టి గ్రామంలోని ప్రభుత్వ భూమిని చందంపేట, మూడుదండ్ల, పోలెనాయక్‌తండాలకు చెందిన వారికి పట్టాచేసినట్టు తెలిసింది.

Related posts