telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీలో .. వాహనాల పార్కింగ్ చార్జీలకు రెక్కలు …

vehicle parking more costlier in delhi

ఢిల్లీలో వాహనాల పార్కింగ్ చార్జీలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. కారు పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచడం ద్వార కాలుష్యాన్ని నియంత్రించాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో కారు పార్కింగ్ ఫీజును వెయ్యిరూపాయలు వసూలు చేయాలని ఢిల్లీ అధికారుల కమిటీ నిర్ణయించింది. ఢిల్లీలో 3.3 మిలియన్ల కార్లు, 73. మిలియన్ల ద్విచక్రవాహనాలున్నాయి. ఢిల్లీవాసులు రోజుకు 500 కార్లు కొత్తగా కొనుగోలు చేస్తున్నారు.

రోడ్లపై ప్రైవేటు కార్లు ఎక్కువగా తిరగకుండా, పార్కింగ్ స్థలాల్లో కార్లు పార్కింగ్ ను తగ్గించేందుకు వాహనాల పార్కింగ్ చార్జీలను అనూహ్యంగా పెంచాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. పార్కింగ్ స్థలం, వాహనం పార్కింగ్ చేసిన సమయం, ప్రాంతం, వేళలను బట్టి పార్కింగ్ ఫీజును నిర్ణయించామని ఢిల్లీ రవాణ కమిషనర్ చెప్పారు. ఢిల్లీలోని లజపత్ నగర్, కరోల్ బాగ్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఉన్నందువల్ల పార్కింగ్ ఫీజులు అధికంగా వసూలు చేయాలని సర్కారు నిర్ణయించింది.

Related posts