telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

కడపలో .. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల.. జేసీ బదిలీ..

Lakshmi's-NTR

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించి కడప జిల్లాలోని మూడు థియేటర్లలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఈ చిత్రాన్ని విడుదల చేయడంపై మండిపడ్డ ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. కడప జాయింట్ కలెక్టర్ (జేసీ) కోటేశ్వరరావును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో ఆయన్ని నియమించాలని ఆదేశించింది.

ఈ నెల 19వ తేదీ వరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని విడుదల చేయకూడదని ఆదేశించింది. మే 1న కడపలోని రాజా థియేటర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర, రైల్వే కోడూరులోని ఏఎస్ఆర్ థియేటర్లలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ప్రదర్శించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఆయా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. సంబంధిత లైసెన్స్ లను రద్దు చేశారు.

Related posts