telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ కి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం…

revanthreddy campaign in huzurnagar

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరారు రేవంత్ రెడ్డి. రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు పాదయాత్రగా మార్చుకున్నారు ఆయన. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని సీతక్క కోరారు. రాజీవ్ రైతు భరోసా దీక్షలో సీతక్క మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా కేసీఆర్, మోడీ దగ్గర మోకరిల్లి వచ్చాడని, రైతును అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారని అన్నారు. ఉత్తరాది రైతులు గట్టి పోరాటం చేస్తున్నారు… మనం ఏం చేస్తున్నాం… నాకు సిగ్గేస్తోందని ఆమె అనారు.  దీక్ష కాదు… రాజీవ్ రైతు భరోసా యాత్ర చేయాలని, రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేయాల్సిందిగా కోరుతున్నా అని సీతక్క కోరడంతో రేవంత్ వెంటనే దానికి ఒప్పుకుని పాదయాత్ర మొదలు పెట్టారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే శక్తి నల్లమల బిడ్డనైన నాకు ఈ ప్రాంత ప్రజలిచ్చారని అన్నారు.  కోట్లు సంపాదిద్దామని రైతు వ్యవసాయం చేయడు – బీరువాలల్ల బంగారం నింపడానికి వ్యవసాయం చేయడని అన్నారు. ఎకరం భూమి ఉంటే ఆత్మగౌరవంగా భావించి వ్యవసాయం చేస్తాడని అన్నారు. మార్కెట్ లో ఏది కొనాలన్నా ధర నిర్ణయించేది అమ్మేవాడే… రైతు పంటకు మాత్రం దళారీ ధర చెబుతున్నాడన్న ఆయన రూ.15 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు మోడీ రుణమాఫీ చేశాడని అన్నారు. కొత్త చట్టాల్లో కొనుగోలు కేంద్రాలు లేవు, మార్కెట్ యార్డులు లేవు, మద్ధతు ధర లేదు, రైతుల జీవితాలను అదానీ, అంబానీలకు అమ్మబోతున్నారు… దీనిని కేసీఆర్ సమర్ధిస్తున్నాడని అన్నారు.

Related posts