telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నష్టం కాంగ్రెస్‌కు కాదు.. తెలంగాణ సమాజానికి: ఉత్తమ్

T Congress boycott mlc elections

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన వ్యవహారం పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. గాంధీభవన్‌లో ఆయన భట్టి విక్రమార్క, వీహెచ్, షబ్బీర్ అలీ, పొన్నాలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎల్పీ విలీనంతో నష్టం కాంగ్రెస్‌కు కాదని, తెలంగాణ సమాజానికి జరిగిందని పేర్కొన్నారు. హరీశ్‌రావుకు కేటీఆర్ అడ్డు రాకూడదని కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఉత్తమ్మండిపడ్డారు. విలీన వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు.

హైకోర్టు తీర్పును బట్టి లోక్‌పాల్‌ను కూడా ఆశ్రయిస్తామన్నారు. కేసీఆర్ తన కుటుంబం కోసం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.ఈ నెల 9 నుంచి టీఆర్ఎస్ వైఖరిపై నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారని మండిపడ్డారు. రహస్య ప్రదేశంలో లేఖ తీసుకుని గంటల వ్యవధిలోనే సీఎల్పీ విలీనాన్ని పూర్తి చేస్తారా? అని ఉత్తమ్ నిలదీశారు.

Related posts