telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈ నెల 23 నుంచి టీఎస్ ఆర్టీసీలో మొగనున్న సమ్మె సైరన్!

Tsrtc increase salaries double duty employees

ఈ నెల 28 నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు వెళ్ళే వారు ఇక్కట్లకు గురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 23 నుంచి సమ్మెకు డిగనున్నారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి నిన్న సమ్మె నోటీసులు అందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. 23,24 తేదీల్లో డిపోల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు.. తెలంగాణలోనూ ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

నష్టాల పేరుతో ఆర్టీసీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని, నిజానికి సంస్థ నష్టాల్లో లేదని అన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీపై “పిచ్చికుక్క” ముద్రవేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచించిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

Related posts