హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలోని పల్లె చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. వదర ఉధృతితో నిండుకుండాలా మారిపోయింది.. అయితే, చెరువు కోతకు గురై ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని లోతట్టు ప్రాంతాలవాసుల భయంభయంగా గడుపుతున్నారు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ , సైబరాబాద్ సీపీ.. పల్లెచెరువు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.. మైక్ ల ద్వారా ప్రచారం చేస్తున్న పోలీసులు.. వీలైనంత త్వరగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటూ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు..
ఇప్పటికే అలీ నగర్ , సుబాన్ కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.. మరోవైపు.. వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతు కాగా.. ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి.. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే..దీనిపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు. పల్లె చెరువు పై జిల్లా కలెక్టరు రెవెన్యూ ఇరిగేషన్ ఎన్ డి ఆర్ ఎఫ్ జి హెచ్ ఎం సి సిబ్బందితో పరిస్థితిని సమీక్షించామన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులతో చర్చించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్, ఆదేశాల మేరకు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.