telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బతుకమ్మ నిమజ్జనం కోసం కొలనులు సిద్ధం: జీహెచ్‌ఎంసీ

ghmc hydeerabad

అన్ని శాఖల సమన్వయంతో నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారన్నారు.వర్షాల వల్ల పాడైన రహదారులకు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో ఇప్పటి వరకు 1043 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. శిథిల భవనాల కూల్చివేత ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు.

ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బతుకమ్మ నిమజ్జనం కోసం కొలనులు సిద్ధం చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తాం. బతుకమ్మ ఆఖరి రోజు ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌కు వరకు బతుకమ్మల ఊరేగింపు ఉంటుంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు.

Related posts