గుజరాత్ రాష్ట్రంలో వాయు తుఫాన్ బీభత్సం సృష్టించే అవకాశముంది. ఈ రోజు మధ్యాహ్నం వాయు తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకనుంది. గుజరాత్‌లోని వెరావల్-ద్వారక మధ్య వాయు తుఫాన్ తీరాన్ని తాకనుంది. గంటకు 150 నుంచి 180 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సహాయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు.
కచ్, జామ్‌నగర్, జునాగఢ్, దేవ్‌భూమి, పోరుబందర్, ద్వారక, రాజ్‌కోట్, అమ్రేలి, భావ్‌నగర్, గిర్-సోమనాథ్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం చూపనుంది. మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 52 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి.