telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో ముగిసిన మంత్రి ఈటల చర్చలు

ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో ముగిశాయి మంత్రి ఈటల చర్చలు. మెడికల్ కాలేజీల్లో కరోనా ట్రీట్‌మెంట్ కోసం సాధారణ బెడ్ల తో పాటు, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అలానే కరోనా నేపథ్యంలో 50 శాతం బెడ్స్ ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో దానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధి డా. కృష్ణారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారని, డ్రగ్స్, ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరాము దానికి ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ప్రయివేటు 24 మెడికల్ కాలేజీల్లో  750 చొప్పున బెడ్స్ ఉంటాయని, గతంలో ప్రతి కాలేజీలో 100 బెడ్స్ ఇచ్చామని అన్నారు. కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్య  చికిత్స అందిస్తామని ఆయన అన్నారు. ఇక మల్లారెడ్డి కాలేజీ ప్రతినిధి భద్రా రెడ్డి మాట్లాడుతూ  50 శాతం బెడ్స్ ఇస్తామని ప్రభుత్వానికి చెప్పామని అన్నారు. మహేశ్వర మెడికల్ కాలేజీ డా. కృష్ణా రావు మాట్లాడుతూ ఇప్పటికే ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

Related posts