telugu navyamedia
క్రీడలు వార్తలు

‘జాతి రత్నాలు’ పై దినేష్ కార్తీక్ ప్రశంసలు…

‘జాతి రత్నాలు’ సినిమా పెద్ద విజయాన్నే సాధించింది.ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతి రత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కరోనా మహమ్మారి భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు ఈ సినిమా ‘కామెడీ టీకా’ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దుమ్ము లేపిన జాతి రత్నాలు.. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ‘జాతి రత్నాలు’ చూసిన ప్రతిఒక్కరు ఆ సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ కూడా జాతి రత్నాలు సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సినిమా బాగుందని, డైలాగ్స్ సూపర్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారని డీకే పేర్కొన్నాడు. డీకేకు తెలుగు కూడా వచ్చన్న విషయం తెలిసిందే. ‘ఓ మై గాడ్.. ఏమా నవ్వుల అల్లర్లు. నేను ప్రతి సన్నివేశంకు నవ్వాను. సినిమాలో అద్భుత డైలాగ్స్ ఉన్నాయి. సూపర్ డైరెక్షన్. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ‘జాతి రత్నాలు’ మంచి ఉల్లాసాన్ని ఇచ్చింది. ఇలా నవ్వించడం చాలా కష్టం. కానీ మీరు బాగా చేశారు. ఎంత కష్టపడ్డారో తెరపై తెలుస్తుంది. ఔట్ స్టాండింగ్ ఫెర్ఫామెన్స్’ అని కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ త ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు.

Related posts