telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో ఆగని కరోనా సునామీ.. 24 గంటల్లో 3,23,144 కొత్త కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.76 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 323144 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 2771 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,51,827 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 26,82,204 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,97,894 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 85.6 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 13.26 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.18శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts