telugu navyamedia
క్రీడలు వార్తలు

ప్రాక్టీస్ లో ధోని జోరు… ఇక ఢిల్లీ బౌలర్ల పని…!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ను చిన్ని సూపర్ కింగ్స్ ఢీ కొట్టబోతోంది. చెన్నై జట్టులో సురేష్ రైనా ఆడటం దాదాపు ఖాయమైనట్టే. వ్యక్తిగత కారణాల వల్ల గత ఏడాది ఐపీఎల్‌కు దూరమైన అతను ఈ సారి జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. రిషబ్ పంత్ కేప్టెన్సీ, స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అదనపు బలం. ఈ మ్యాచ్‌ కోసం ధోనీ.. నెట్స్‌లో కఠోరంగా శ్రమించాడు. సుదీర్ఘకాలం పాటు నెట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. క్రికెట్‌లోని అన్ని రకాల షాట్లను ధోనీ సునాయాసంగా ఆడాడు. తనకు మాత్రమే అలవాటైన హెలికాప్టర్ షాట్‌ను నాలుగైదు సార్లు సక్సెస్‌ఫుల్‌గా ట్రై చేశాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, స్క్వేర్ కట్, లాంగ్ ఆన్, స్ట్రెయి్ డ్రైవ్.. ఇలా క్రికెట్ బుక్‌లో ఉండే అన్ని షాట్లను ధోనీ అలవోకగా ఆడటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అయితే ఐపీఎల్‌ అన్ని సీజన్లలో ఇప్పటిదాకా ధోనీ 204 మ్యాచ్‌లను ఆడాడు.

Related posts