telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మాయమవుతున్న ఇందిరా పార్క్ లోని గంధపు చెట్లు…

అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, గంధం చెక్కలను అక్రమంగా తరలిస్తారు అనే విషయం నాదరికి తెలుసు. అలా తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు, అటవీ అధికారులు చాలా మందిని పట్టుకున్నారు. కానీ తాజాగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో గంధం చెట్లు మాయమవుతున్నాయి. ఇలా పార్క్ లో గంధం చెట్లు మాయమవుతుండటంతో అక్కడ మార్నింగ్ వాకర్స్ ఆందోళన చేస్తున్నారు. పార్క్ అధికారులు పై చర్యలు చేపట్టాలంటూ ఆందోళనకు దిగ్గారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గంధం చెట్ల మాయం అవుతున్నాయని అంటున్నారు వాకర్స్. దొంగతనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలి అని చెబుతున్నారు.  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆరోపిస్తున్నారు. నామమాత్రపు చర్యలు చేపట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎవరో ఇంటి దొంగలే చేసిన పనిగా అక్కడి అధికారులు భావిస్తున్నారు.

Related posts