telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అధికారిపై హిట్లర్ మీమ్‌ తో ఉద్యోగం పోగొట్టుకున్నాడు… కానీ కోటిన్నర సంపాదించాడు…!!

bp

స్కాట్ ట్రేసీ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని బీపీ అనే పెట్రోలియం సంస్థలో ‌పనిచేసేవాడు. జనవరి 2019న స్కాట్ తన స్నేహితులు, తోటి సిబ్బందితో అడాల్ఫ్ హిట్లర్ మీమ్‌ను షేర్ చేశాడు. ఆ సంస్థలో తమ జీతాల పెరుగుదలకు అడ్డువస్తున్న ఓ పై అధికారిపై వ్యంగ్యాస్త్రంగా ఆ మీమ్‌ను పోస్టు చేశాడు. అయితే, ఆ అధికారికి భజన చేసే ఓ వ్యక్తి స్కాట్ పోస్టు చేసిన మీమ్‌ను చూపించాడు. దీంతో అది సంస్థ పెద్దల వరకు వరకు వెళ్లింది. బాసునే గేలీ చేస్తాడా అంటూ స్కాట్‌ను జాబ్ నుంచి పీకేశారు. దీంతో స్కాట్ ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)ను ఆశ్రయించాడు. అతని అభ్యర్థనపై స్పందించి ఎఫ్‌డబ్ల్యూసీ ఈ ఘటనపై విచారణ చేపట్టింది. ఇందులో స్కాట్ తప్పేమీ లేదని, అకారణంగా విధుల నుంచి తొలగించడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడని ఎఫ్‌డబ్ల్యూసీ పేర్కొంది. 1.43 లక్షల డాలర్లు (రూ.1.6 కోట్లు) పరిహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, బీపీ సంస్థ అతడిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీపీ సంస్థ ఈ ఏడాది మే నెలలో ఫెడరల్ కోర్టుకు వెళ్లింది. అయితే, అక్కడ కూడా ఆ సంస్థకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయంపై సమీక్ష జరుపుతున్నట్టు బీపీ సంస్థ ప్రకటించింది. ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆస్ట్రేలియన్ వర్కర్స్ యూనియన్(ఏడబ్ల్యూయూ) సమర్థించింది. ఉద్యోగిని ఆదుకోవడం కోసం పరిహారం అందించినందుకు దన్యవాదాలు తెలిపింది. త్వరలోనే అతడు అదే సంస్థలో మళ్లీ విధుల్లో చేరతాడని ఆశిస్తున్నామని పేర్కొంది.

Related posts